ఝరాసంగం మండలం కుప్ప నగర్ గ్రామంలో ఇంటి ముందు విద్యుత్ తీగలు వాలి ప్రమాదకరంగా మారాయిని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు దురుసుగా వ్యవహరిస్తూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.