ఝరాసంగం మండలం కుపా నగర్ గ్రామంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టపల్లి బాలరాజ్ పాల్గొని, వారు మాట్లాడుతూ.. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాదం, అనారోగ్యం, లేదా ఇతర అనివార్య పరిస్థితులలో కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా రక్షిస్తుంది. రైతులు ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు. ఇన్సూరెన్స్లో సేవింగ్ డిపాజిట్ లా ఇన్సూరెన్స్ చేయించుకుంటే జీవితం బాగుంటుందన్నారు.