వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. గుమ్మడిదల మండల పరిధిలోని వీరిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గొర్రె పిల్లని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. 12 గొర్రె పిల్లలు మృతి చెందాయని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద తప్పించాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.