HYD మెట్రోలో తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ మెట్రో రైళ్లో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో రైలు ఉన్నప్పుడు సెన్సర్ పని చేయక డోర్ మధ్యలో ప్రయాణికుడు ఇరుక్కున్నాడు. స్థానికుల సాయంతో అతను బయట పడ్డాడు. కొంచెం అటు ఇటయితే ప్రాణం పోయేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.