సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో క్రమ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మండల పరిధిలోని కొడకంచి, మాదారం, శివానగర్, గడ్డపోతారం, కాజిపల్లి, తదితర గ్రామాలలో శుక్రవారం ఉదయం 12. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 85. 6% గా ఉంది. పొగ మంచు కారణంగా వాహనదారులు హెడ్లైట్లు వేసి మరి వాహనాలను నడిపారు. చలి తీవ్రత పెరిగింది.