సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం రజత కవచ అలంకరణ ఉత్సవానికి ఆదివారం ముఖ్యఅతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిధిలో గల హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.