విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 10వ, తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నగదు పురస్కారాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.