సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 117 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఓ వరం లాంటిది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.