పటాన్చెరు డివిజన్ పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల భవనంలో 2025- 2026విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలిసి డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు.