పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామంలో గల మహిధర లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాలనీలో నూతనంగా నిర్మించిన క్లబ్ హౌస్ ను ప్రారంభించారు.