సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విన్నవించారు. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నయని మంత్రికి వివరించారు.