సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ రాఘవేంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.