కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షాను గురువారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ తో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, తదితరులు ఉన్నారు.