లింకు రోడ్డును పరిశీలించిన ఎంపీఓ

64చూసినవారు
గ్రామస్తులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం మంగంపేట గ్రామంలోని 55 సర్వేనెంబర్ లో గల మంగంపేట గ్రామం నుండి ఉట్ల గ్రామం వరకు గల లింకు రోడ్డును హిటాచి పెట్టి రోడ్డును ధ్వంసం చేస్తుండడంతో సమాచారం తెలుసుకున్న గ్రామ ప్రజలు అక్కడికి వచ్చి ధ్వంసం చేసిన రోడ్డును మళ్లీ అదే హిటాచి తో మరమ్మత్తు చేయించారు. ఈ విషయం పై ఎంపీఓ కి తెలపగా గురువారం వచ్చి రోడ్డును పరిశీలించారు. ఈ విషయంపై ఆజాద్ ఇంజనీరింగ్ పరిశ్రమ యజమాన్యంపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్