ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని నీలం మధు అన్నారు. వడ్డే ఓబన్న 218వ, జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని నీలం మధు క్యాంపు కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడని అన్నారు.