బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని హుడా స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో హుడా స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది కూల్చివేశారు. అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.