విద్యార్థులు స్థిరమైన లక్ష్యసాధన కోసం చదవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.