
అనేక సమస్యలను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం: సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసిన నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసింది. పింఛన్లు, మెగా డీఎస్సీతో ఉపాధి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ కల్పన, రాజధాని, పోలవరం పునర్నిర్మాణం, రైల్వే జోన్ సాధన’’ వంటివి చేశాం. అనేక సమస్యలను దాటుకుంటూ, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం అని సీఎం అన్నారు.