సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కార్పొరేటర్ పుష్ప నగేష్ బుధవారం జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సీసీ రోడ్లు, రామచంద్రాపురం బస్సు రూట్లో సెంటర్ డివైడర్ తో కూడిన 10మీటర్ల రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నాయకులు పాల్గొన్నారు.