సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిద మండలం నల్లవల్లి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డంపు యాడు వద్దంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుమ్మడిదల మండలంలో స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటిస్తున్నారు.