పటాన్ చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజగోపురం కలశ ప్రతిష్టాపన మహోత్సవంలోె ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.