నిర్దేశించిన గడువులోగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పైన వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రౌండింగ్ అయిన యూనిట్లను నిర్దేశించారు.