సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ అతిథిగా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శేషాద్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దత్తు, కార్యదర్శి అనిల్ చారి పాల్గొన్నారు.