రాష్ట్ర స్థాయి జీవశాస్త్రం ప్రతిభ పోటీలు సంగారెడ్డిలోని డాక్టర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 33 జిల్లాల నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతిభా పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.