సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గురువారం రావి ఆకులపై సీఎం చిత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. కాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష మరెల్లి దత్తు, జాయింట్ సెక్రటరీ శేషాద్రి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమింపజేసేది లేదని పేర్కొన్నారు.