సమీకృత కలెక్టరేట్ పక్కన సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మధనం గంగాధర్ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మరెల్లి దత్తు, పాల్గొన్నారు.