సమస్యను పరిష్కరించండి

61చూసినవారు
సమస్యను పరిష్కరించండి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం మాదారం గ్రామంలోని రామాలయం ఎదురుగా సర్వే నెంబర్ 729లో ఉన్న పెంట స్థలాలు, గడ్డి నిలువ ఉంచే స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న గ్రామస్తులు వాటికి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ను బుధవారం కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.