సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం వైకుంఠధామం నిర్లక్ష్యానికి గురవటం పట్ల బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో అంతిమ సంస్కారాలను చేసే అవకాశం లేకుండా ఇక్కడ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. చెత్తాచెదారంతో నిండిన వ్యవహారాన్ని వీడియో రూపంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.