పటాన్చెరు పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపి అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ హాజరై ముగ్గుల పోటీలను శుక్రవారం ప్రారంభించారు. సుమారు 100 మంది మహిళలు ముగ్గులు వేశారు. ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి 2వ బహుమతి 3వ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.