సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో విషాద సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బొల్లారం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి లంబాడీ నరసింహ పారిశుద్ధ్య విధుల్లో భాగంగా ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతి చెందిన నరసింహ కుటుంబానికి న్యాయం చేయాలని బొల్లారం బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని దగ్గర ఉండి మృతదేహాన్ని బయటికి తీయించారు.