
తల్లికి వందనం విధి విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
తల్లికి వందనం కార్యక్రమం అమలు వివరాలపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. స్కూల్స్ తిరిగి తెరచుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధుల విడుదల, అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు.