అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడ గుట్టపై వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార గుండా వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు.