సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ లో కంకర క్రషర్, క్వారీ ఏర్పాటుకు వ్యతిరేకంగా శుక్రవారం గ్రామస్తులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వెంటనే క్రషర్ల ఏర్పాటు చర్యలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.