
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్
AP: సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో పలువురు ఎమ్మెల్సీలు SGT కౌన్సెలింగ్ పై చర్చించి, వారి అభిప్రాయాన్ని తనకు తెలియజేసినట్లు వివరించారు.