సంగారెడ్డి: అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి

68చూసినవారు
సంగారెడ్డి: అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్ చెరు పట్టణంలో సోమవారం ఉదయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణ ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్