సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి మేళ్ల చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం సందర్శించారు. చెరువు కబ్జాకు గురవుతుందని పలువురు హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.