శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ తో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మంగళవారం భేటీ అయ్యారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని కాలనీలలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్లు, నాలా, డ్రైనేజీ వ్యవస్థల సమస్యలను జోనల్ కమిషనర్ కి కార్పొరేటర్ వివరించారు. కాగా సమస్యను విన్న కమిషనర్ స్పందిస్తూ ఈ నెల 11వ, తేదీన పటాన్ చెరు డివిజన్ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు.