ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శులు మహేష్ కుమార్, మహమ్మద్ అబీద్ తెలిపారు. సంగారెడ్డి లోని మంత్రి నివాసంలో సోషల్ మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను దశలవారీగా అమలు చేస్తుందని చెప్పారు. సమావేశంలో సోషల్ మీడియా సమన్వయకర్త శ్రీకాంత్ పాల్గొన్నారు.