
విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. విమానంలోని 241 మందితోపాటు బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రమాదం జరిగినప్పుడు 24 మంది మెడికోలు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించడం మరింత కలచివేస్తోంది.