జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సన్న దొడ్డు బియ్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, శిక్షణ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.