నూతన వెంచర్లలో అల్యూమినియం వైర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ అరెస్టు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదాశివపేట సిసిఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో దొంగలను పట్టుకొని 2. 02 లక్షల విలువైన 778 కిలోల అల్యూమినియం ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 9 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.