భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి పాత బస్టాండ్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.