రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఐడి రామాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సంబంధిత ఫారాలు మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.