సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పాంపాటి కృష్ణమూర్తి తెలిపారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, కోశాధికారి పుల్లూరి ప్రకాష్, గౌరవ అధ్యక్షుడు మ్యాడం రాధా కిషన్, అసోసియేట్ అధ్యక్షుడు నామ భాస్కర్ పాల్గొన్నారు.