సదాశివపేట మండలం నంది కంది లోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ జాతరలో భాగంగా శనివారం కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో కల్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. శివుని కీర్తిస్తూ భక్తులు పాటలు పాడారు. ఆలయంలో గత 12 సంవత్సరాల నుంచి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.