డంపు యార్డులో బయోమైనింగ్ పనులను వెంటనే ప్రారంభించేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ఫసల్ వాది శివారులోని సంగారెడ్డి మున్సిపాలిటీ డంపు యార్డును గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ డిసెంబర్ వరకు బయో మైనింగ్ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.