రక్తదాన శిబిరం అభినందనీయం: ఎమ్మెల్యే

83చూసినవారు
అంబేద్కర్ జయంతి సందర్భంగా యువకులు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణాన్ని కాపాడడమని చెప్పారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరి రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్