అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా సదాశివపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులు హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్ధలతో చదివారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.