ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి అన్నారు. చౌటకూరు మండలం కోర్పోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధిస్తూ అర్థమయ్యేలా చెబుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అడిపప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.