Top 10 viral news 🔥


లొంగిపొమ్మన్న తల్లి.. ఉగ్రవాది ఆన్సర్ ఇదే (VIDEO)
భద్రతాబలగాలు నిర్వహించిన తాజా ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకడైన ఆమిర్ నజీర్ తన ఇంటికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తల్లి ఇంటికి రావాలని కోరగా, ‘సైన్యాన్ని రమ్మను చూసుకుంటా’ అని సమాధానమిచ్చాడు. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆమిర్‌తో పాటు ఆసిఫ్ అహ్మద్ షేక్, యావర్ అహ్మద్ భట్ కూడా మృతి చెందారు.